* భారతదేశం తరఫున న్యాయనిర్ణేతగా ఎంపిక
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరఫున ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. భరద్వాజ్ ఎంపికతో వరంగల్ (Warangal) వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఫిలిప్పీన్స్ దేశంలో ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. జేఎన్ఎస్లోని జిమ్నాస్టిక్స్ అకాడమీ పూర్వవిద్యార్థి భరద్వాజ్ పలు జాతీయస్థాయి పోటీల్లో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో పతకాలు సాధించారు. ఆ ప్రతిభ ఆధారంగా క్రీడాకారుల కోటాలో ఇండియన్ రైల్వే(Indian Railway) లో ఉద్యోగం సాధించి కాజీపేటలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్(World Junior Gymnastics Champion) లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు.
