* అకౌంట్లో రూ.3 కోట్లను ఫ్రీజ్ చేసిన పోలీసులు
* తెలుగు సినీ నిర్మాతల్లో ఆనందం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఐ బొమ్మ నిర్వాహకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఇదీకాస్తా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి వచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ వెబ్ సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ ఓటీటీ కంటెంట్ ఉంది. దీంతో ఐ బొమ్మపై తెలుసు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన రవిని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడని సమాచారం. అరెస్ట్ అనంతరం అతని అకౌంట్లో రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. ఐ బొమ్మ నిర్వాహకున్ని తప్పకుండా అరెస్టు చేస్తామని పోలీసులు సినీ నిర్మాతలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు సినీ నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.
……………………………………………………
