* పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజిస్ర్టార్
ఆకేరు న్యూస్, డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హై కోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………………
