* రూ. 50 లక్షల విలువైన బంగారం..
* భారీగా నగదు ఎత్తుకెళ్లిన దుండగులు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగరంలోని కార్ఖాన పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్రావ్ ఎన్‌క్లేవ్‌లో కెప్టెన్ గిరి ఇంట్లో నేపాల్ ముఠా ఈ చోరీకి పాల్పడింది. ఇంట్లో పని చేసే నేపాల్‌కు చెంది వ్యక్తి మరో నలుగురితో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. యజమానిపై దాడి చేసి.. ఆ తరువాత తాళ్లతో కట్టేసి రూ. 50 లక్షల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. 25 తులాలకు పైగా బంగారం, రూ. 23 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
………………………………………………………..
