బీజేపీ ఎంపీ బండి సంజయ్
* ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ పిలుపు
* కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతంర ఈ కామెట్స్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ పిలుపునిచ్చారు. వారికోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని చెప్పుకొచ్చారు. హిందూ రక్షణే ధ్యేయంగా మనమంతా పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లీంలకు కొమ్ముకాసే దుస్థతి నెలకొందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇది తేటతెల్లమైందని చెప్పారు. ఇప్పటికైనా హిందువులు ఐక్యంగా ఉండాలని బండి సంజయ్ కోరారు.
…………………………………………………..
