* చిరంజీవి సహా ప్రముఖుల భేటీ
ఆకేరు న్యూస్, సినీ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులంతా కాసేపటి క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిశారు. ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై ధన్యవాదాలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్‌బాబు, ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి ఉన్నారు. టాలీవుడ్ పైరసీని అరికట్టినందుకు వారు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. రవి అరెస్టు కు శ్రమించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున ఆసక్తికర అంశం వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు తమ కుటుంబంలోనూ ఒకరిని సుమారు రెండు రోజులు పాటు డిజిటల్ అరెస్టు పేరుతో నిర్బంధించారని, పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారని వెల్లడించారు.
పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు : చిరంజీవి
పైరసీ కేసులో రవి సహా మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారని, వాళ్ల కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి తెలిపారు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలని, పైరసీని చూడొద్దని సూచించారు.
పోలీసులతో ఆటలొద్దు
సీపీ సజ్జనార్ ను కలిసిన వారిలో దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐ బొమ్మ వెబ్సైట్ కీలక నిందితుడు ఇమ్మడి రవి అరెస్ట్ సినిమాలో సూపర్ హిట్ సన్నివేశంలా ఉందని అన్నారు. విలన్ ఛాలెంజ్ చేస్తే రెండు నెలల తర్వాత హీరో అతడిని కటకటాల వెనక వేసినట్లు ఉందని తెలిపారు. భస్మాసురుడి హస్తంలా తన తలమీద తనే చేయిపెట్టుకున్నాడని, పోలీసులతో ఆటలొద్దని హితువు పిలికారు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నానని, ఏదీ ఉచితంగా రాదని తెలిపారు. ఒకవేళ అలా వస్తే దాని వెనక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని, అది చావు వరకూ తీసుకెళ్తుందని హెచ్చరించారు.
………………………………………………………
