* అదనపు కట్నం వేదింపులు భరించలేక
*7 నెలల గర్భిణి ఆత్మహత్య
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి, భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో కుటుంబ సభ్యులు వివాహాం చేశారు. అదనపు కట్నం కోసం ప్రశాంత్ పెట్టే టార్చర్ భరించలేక, ఏడు నెలల గర్భిణిగా ఉన్న మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. తన కూతురు చావుకు కారణమైన ప్రశాంత్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మౌనిక తల్లి, మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
……………………………………………
