సీఎం రేవంత్ రెడ్డి
* మంత్రివర్గ సమావేశంలో సీఎం నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రూ.5 లక్షల ఎక్స్గ్రెషియాను ప్రకటించారు. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటు మైనార్టీ విభాగానికి చెందిన ఉన్నతాధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు గాను బాధిత కుటుంబ సభ్యులకు చెందిన ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంది. సౌదీలో సోమవారం తెల్లవారుజామును జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మరణించారు. వీరంతా హైదరాబాద్ వాసులేనని.. తెలంగాణ హజ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
……………………………………………………..
