* సత్యసాయి జయంతి వేడుకల్లో ఐశ్వర్యారాయ్ బచ్చన్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సత్యసాయి బాబా మానవసేవయే మధవ సేవ అని నమ్మారని ప్రముఖ నటి మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ అన్నారు. సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పుట్టపర్తి వచ్చారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ బచ్చన్ మాట్లాడుతూ సత్యసాయి మానవతా వాదాన్ని,ప్రేమను, శాంతిని కాంక్షించారని అన్నారు. సత్యసాయి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. లక్షల మందికి విద్యా దానం చేసిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. ఉచితంగా పేదలకు కార్పొరేట్ విద్యాను అందించడం సత్యసాయికే సాధ్యమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల దాహం తీర్చిన ఘనత సత్యసాయిదన్నారు.బాబాది ప్రేమ మతం, మానవతా జాతి. మానవత్వమే జాతి, ప్రేమే మతం, హృదయమే బాష, దేవుడు సర్వవ్యాప్తుడు.. అని బాబావారు ఎప్పుడూ చెబుతుండేవారని అన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరుకావడం తన జీవితంలో మర్చిపోలేనిదని ఐశ్వర్య అన్నారు.
…………………………………………………………………
