* సత్యసాయి బాబా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సచిన్ టెండూల్కర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సత్యసాయి బాబా తనకు పంపించిన పుస్తకం వల్లే 2011లో ప్రపంచ కప్ సాధించగలిగామని క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్ అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సచిన్ పుట్టపర్తి వచ్చారు. సత్యసాయి బాబాతో తనకున్న అనుభవాలను సచిన్ నెమరువేసుకున్నారు. 2011లో ప్రపంచ కప్ లో భాగంగా తాను బెంగళూరు లో ఉన్నప్పుడు సత్యసాయి తనకు ఓ పుస్తకం పంపారని సచిన్ గుర్తుచేసుకున్నారు. ఆ పుస్తకం చదివి చాతా ప్రేరణ పొందానని అన్నారు. ఆ పుస్తకమే తనను వరల్డ్ కప్ లో విజయతీరాలకు చేర్చేందుకు తోడ్పడిందని సచిన్ బావోవ్వేగంతో గుర్తుచేసుకున్నారు. తనపై బాబా ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని సచిన్ అన్నారు.
……………………………………………..
