* తెలంగాణ ప్రభుత్వ పతనం తప్పదు
* సూర్యాపేట జిల్లాకు బీఎన్‌రెడ్డి పేరు పెట్టాలి
* ఏఐకేఎఫ్-ఏఐడబ్ల్యూఎఫ్ ధర్నా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజాయోధుల త్యాగాలను, చరిత్రను విస్మరిస్తే తెలంగాణ ప్రభుత్వానికి పతనం తప్పదని ఆదర్శాలను అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య ( ఏఐఏడబ్ల్యూఎఫ్) హెచ్చరించాయి. సూర్యాపేట జిల్లాకు బీఎన్‌రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద బుధవారం మహాఽధర్నా నిర్వహించాయి. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆచరణలో ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతోందని వక్తలు విమర్శించారు. వీర తెలంగాణ రైతాంగ ఉద్యమ యోధులను, చరిత్రను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువకు ఏ మాత్రం సంబంధం లేని మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి పేరును ప్రకటించడం అన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి, భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం పనిచే సి సాధించిన గొప్ప వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ బీంరెడ్డి నరసింహారెడ్డి అని తెలిపారు. ఆయన నాయకత్వంలో వేలాది మంది ఎర్ర జెండా పట్టారని గుర్తు చేశారు. మాట్లాడిన వారిలో ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, టీఎఎస్డిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి తీగల సాగర్, బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, ఏఐకెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెద్దారపు రమేష్, హైకోర్టు న్యాయవాది నరసింహరావు తదితరులు ఉన్నారు.
…………………………………..
