* ఆందోళనకు గురైన భక్తులు
ఆకేరు న్యూస్, కరీంనగర్ :
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహాం పార్వతిపురంలో ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పాములు పట్టే జగదీష్, ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. దీంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ అధికారులు పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. వసతి గృహాంలో సేద తీరుతారు. వసతి గృహాల పర్యవేక్షణపై భక్తులు మండిపడుతున్నారు. భవిష్యత్లో ఇలాంటి చర్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న భక్తులు కోరుతున్నారు.
