* కార్పొరేట్ల ప్రయోజనాలకే.. హింసాకాండ
* హత్యాకాండకు వ్యతిరేఖంగా..
ఈనెల 23న.. భారత్ బంద్కు పిలుపు
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత విప్లవోద్యమంలో.. హిడ్మాది చెరిగిపోని చరిత్ర అని.. మావోయిస్టు కేంద్ర కమిటీ తెలిపింది. కేంద్రంలో ఉన్న మతోన్మాద బీజేపీ కార్పొరేట్ల ప్రయోజనాలకే హింసాకాండకు పాల్పడుతోందని అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లేఖ విడుదల చేసింది. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజేను కాల్చిచంపారని పేర్కొంది. హిడ్మా.. సహచర బృందం చికిత్స నిమిత్తం విజయవాడకు వెళుతున్న క్రమంలో కొంత మంది విప్లవ ద్రోహులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈనెల 15న పట్టుకొని.. మారేడుపల్లిలో కాల్చిచంపారని పేర్కొంది. కాల్చిచంపి..ఎన్కౌంటర్ కథ అల్లారని తెలిపింది. పార్టీలో చేరిన హిడ్మా వివిధ హోదాల్లో పనిచేసి కేంద్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరించాడని స్పష్టం చేసింది. ప్రజాపోరాటాలను విచ్ఛిన్నం చేసేందుకై ఆర్ ఎస్ ఎస్, బీజేపీ యుద్దోన్మాదానికి పాల్పడుతోందని పేర్కొంది. కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే విప్లవపోరాటంలో కార్మికులు, రైతాంగం, యువత ముందకు రావాలని..దేశంలో బీజేపీ చేపడుతున్న హత్యాకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 23న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. హిడ్మా ఉద్యమ స్ఫూర్తి, సిద్ధాంత పటిమను కొనసాగిస్తామని వెల్లడించింది.
