* జీవో విడుదల చేసిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు రేవంత్ సర్కార్ తెర దింపింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ప్రకారం బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాల్లో 23 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయని తెలిపింది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది.

