ఆకేరు న్యూస్, ములుగు: మొక్కజొన్నలు మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కోనుగోలు చెసి మొక్కజొన్న రైతులను దళారుల నుండి రక్షించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు . సోమవారం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కల్లాలను పరిశీలించారు..ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మ వెంకటరెడ్డి మాట్లాడుతూ లింగాల గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు 1000 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశారని ప్రస్తుతం చేతికి వచ్చిన మొక్కజొన్నలు అమ్ముదామంటే దళారులు అడ్డికి పావు షేరు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా క్వింటాలుకు 2400 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని. జిల్లాలో ఎక్కడ ఇంతవరకు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రైతులు ఎకరాకు 25 వేల నుండి 30 వేల ఖర్చు పెట్టుకుని అతి వర్షాలకు మొక్కజొన్న దెబ్బతిని ఇబ్బంది పడి మొక్కజొన్నలు పండిస్తే గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం లింగాల గ్రామపంచాయతీలో మార్క్ఫెడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతుల పండించిన మొత్తం మొక్కజొన్నలని ప్రభుత్వ కొనుగోలు చేయాలని దళారుల నుండి రైతులు కాపాడాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఊకే ప్రభాకర్,జన్ను ఎల్లయ్య,ఊకె నాగేశ్వరరావు,పాయం నర్సింగరావు, ఊ కే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
…………………………………..
