ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసి ఆరాధ్య దైవాలు వెలసిన మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను ములుగు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రామ్ నాధ్ కేకన్ సోమవారం ఆదివాసి సంస్కృతి ఆచార సంప్రదాయాల ప్రకారం అమ్మవార్ల గద్దెలపై పసుపు కుంకుమ బంగారం బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనకు మొదట మేడారం పూజారులు దేవాదాయ శాఖ అధికారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు .స్థానిక పోలీస్ అధికారులతో జాతర పరిసరాలలో పర్యటించారు. ఆయన వెంట స్థానిక పోలీస్ అధికారులు సివిల్స్ సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులున్నారు.
………………………………………………………….
