* స్లాబ్ పెచ్చులూడి ముగ్గురు కార్మికులు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. భవనానికి మరమ్మతులు చేస్తుండగా శ్లాబ్ పెచ్చులూడీ కార్మికులపై పడింది. దీంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలోని ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. శ్లాబ్ పెచ్చులు మీద పడడంతో.. వాటిని తొలగించి కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈఎస్ఐ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు.
…………………………………………………………
