* దరఖాస్తు చేసుకోండి?
*హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయని, లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్‌కు 7వ తరగతి పాసైన వారు అర్హులని, సంబంధిత ట్రేడ్‌లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫారంను డౌన్లోడ్ చేసుకుని గన్‌ఫౌండ్రీలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇతర రాష్ర్టాలు/బోర్డులు జారీ చేసిన పాస్ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు పైన పేర్కొన్న సాంకేతిక పరీక్షలకు ప్రవేశం కోసం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నుంచి ముందస్తు అనుమతి పొందాలని, పరీక్షా రుసుమును ప్రభుత్వ ట్రెజరీ చలాన్ ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు.
………………………………………
