ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో ని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో డిజిపి ఆఫీస్ నుంచి వచ్చిన రెయిన్ కోట్లు, టీ షర్ట్ లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ పోలీసు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు కాలం, సమయం తో సంబంధం లేకుండా 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని, వారికి కాలానుగుణంగా, రెయిన్ కోట్లు, స్వెట్టర్ లు, టీ షర్ట్ లు, ఇవ్వడం ద్వారా విధులలో వారికి కొంత తోడ్పాటు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి శివ ఉపాధ్యాయ, ములుగు డి.ఎస్.పి రవీందర్, ఆర్ఐ అడ్మిన్ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
…………………………………………………
