* జమ్మికుంట మండలం శంభునిపల్లెలో కలకలం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లెలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. గోనెసంచిలో మృతదేహం ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. పోలీసుల వివరాల మేరకు.. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి, గోనె సంచిలో కట్టి, అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం జమ్మికుంట పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే జమ్మికుంట పోలీసులకు సమాచారం అందించగలరని కోరారు. హుజూరాబాద్ ఏసిపి 8712670733, జమ్మికుంట పట్టణ సీఐ 8712670766, ఎస్ఐ జమ్మికుంట 8712551164 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. జమ్మికుంట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
……………………………….
