* పనులు నాణ్యతతో పారదర్శ కంగా చేపట్టాలి
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యం మాస్టర్ ప్లాన్ తో చేపట్టబోయే ఆదివాసి ఆరాద్యా దైవాలు పగిడిద్దరాజు ,గోవిందరాజుల గద్దె ల నిర్మాణం పనులు డిసెంబర్ నెల 4వ తేదీ లోపు పూర్తి చేసి ఆరోజు న భక్తులు పునః నిర్మాణ చేసిన గద్దెలపై మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ,మహబూబాబాద్ ఎంపీ కోరిక బలరాంనాయక్, సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాస రాజు లు ఆకస్మికంగా శుక్రవారం మేడారం సందర్శించారు. అమ్మవార్లకు ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు చెల్లించారు. అనంతరం అమ్మవార్ల ఆవరణలో మాస్టర్ తనతో చేపడుతున్న పనులను పరిశీలించి ఎంత కాలంలో పూర్తి చేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. జాతర ముందు ఉన్నప్పటికీ భక్తుల రాక కొనసాగుతుందని అన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించి చర్చించారు. పనులన్నీ సకాలంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఎన్ సి మోహన్ నాయక్ తో పాటు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు పూజారులు దేవాదాయ శాఖ అధికారులు తదితరులున్నారు.

…………………………………………………

