* దేశంలో ఏ ఉత్సవాలకూ జాతీయ హోదా లేదు
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, వరంగల్ : మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్ రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించేందుకువరంగల్ వచ్చిన కిషన్ రెడ్డి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదని తెగేసి చెప్పారు. అంతకు మందు వందే భారత్ రైలులో వరంగల్ చేరుకున్న కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్లో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన నగరంలో ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని పేర్కొన్నారు. మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు.వరంగల్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప, వేయిస్తంభాల గుడికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.ఇదిలా ఉండగా మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టింది. మేడారం జాతర ప్రారంభం అయ్యే నాటికి మేడారంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.
