* తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలుసుకొని హైదరాబాద్ లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఇరువురు నేతలను ఆహ్వానించారు.భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన “తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్” గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు.సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ,రాష్ట్ర ఎంపీలు భేటీలో ఉన్నారు.
