* వారిని అవమానిస్తున్న రేవంత్ సర్కార్..
* ఎమ్మెల్యే హరీష్రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎన్నికల ముందు హోంగార్డులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. వారిని తీవ్రంగా అవమానిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల మంది హోంగార్డులకు హరీష్రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి సేవలను గుర్తించి చేపట్టిన చర్యలను గుర్తు చేశారు. అలాగే హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారని.. సకాలంలో చికిత్స అందక అనేక మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభయ హస్తం మేనిఫెస్టోలో హోంగార్డుల అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. హోంగార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
……………………………………………….

