* కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి హత్య
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో పట్టపగలే హత్యలు, దోపిడీలు, దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం ఉదయం మల్కాజిగిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లాబాంగ్ స్కూల్ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. వెంకటరత్నం అనే రియల్టర్‌ను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడిరచిన గుర్తుతెలియని వెక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
