Vardhannapet Meeting Boycott Protest
* గ్రామాల పట్ల స్థానిక ఎమ్మెల్యే, అధికారుల వివక్షపై మండిపాటు
* ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ప్రజాప్రతినిధులు
ఆకేరు న్యూస్, వర్దన్నపేట:
మండల సర్వసభ సమావేశాన్ని ప్రతిపక్ష BRS, BJP పార్టీలకు చెందిన సర్పంచ్ లు మరియు ప్రజాప్రతినిధులు గురువారం నాడు తీవ్ర నిరసనల మధ్య బహిష్కరించారు. తమ గ్రామాల పట్ల అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
అధికార పార్టీకి చెందిన గ్రామాలకే ప్రాధాన్యం ఇస్తూ, ఇతర గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తున్నారని BRS, BJP నాయకులు మండిపడ్డారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సమానంగా నిధులు కేటాయించాలని, సంక్షేమ పథకాల అమలులో రాజకీయ పక్షపాతం చూపకూడదని డిమాండ్ చేశారు.
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వం, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.
ప్రజాస్వామ్యంలో అన్ని గ్రామాలు, ప్రజలు సమానమే. రాజకీయాలకు అతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలి. వివక్ష వీడేంత వరకు మా పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో మండల పరిధిలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, BRS, BJP ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
