* సికింద్రాబాద్లో యువతి దారుణ హత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం వారాసిగూడలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమె బంధువే ఆమెను గొంతుకోసి చంపేశాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ఉమాశంకర్ అనే యువకుడు ఆమె గొంతుకోశాడు. మద్యం అలవాటు ఉండడంతో ఉమాశంకర్తో పెళ్లికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అతడు గొంతుకోశాడు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
………………………………………….
