ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో మొదటి విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సరళి ని అధికారుల బృందం పరిశీలించారు .ఇందులో తాడ్వాయి మండలంలోని గంగారం, కాటాపూర్, దామరవాయి గ్రామాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ డి.ప్రశాంత్ కుమార్, నార్లాపూర్, మేడారం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దివాకర, సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నాగారం, తాడ్వాయి ,గోవిందరావుపేట మండలంలో ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ సందర్శించి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

………………………………
