ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం రోజు ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోయారు. పాటిల్‌కు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (బీజేపీ నాయకురాలు), ఇద్దరు మనమరాళ్లు ఉన్నారు.శివరాజ్ పాటిల్ 1991 నుం 96 వరకు లోక్‌సభ స్పీకర్ గా పని చేశారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా పని చేశారు. 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. 1980-2004 వరకు లోక్ సభ ఎంపీగా ఉన్నారు. వరుసగా ఏడుసార్లు ఆయన లోక్ సభ ఎంపీగా గెలవడం విశేషం. ఆయన ప్రముఖ అధ్యయనకారుడు. పుస్తకాలు బాగా చదివేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక విషయం పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పష్టమైన ప్రసంగాన్ని ఇచ్చేవారని.. మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉండేదని వివరించారు.
………………………………….
