Ayush Junior Doctors Strike Over Stipend Hike in Telangana
* స్టై ఫండ్ పెంచే వరకూ ఆగదని హెచ్చరిక
* పదేళ్లుగా పెంపు లేదని ఆవేదన
* సమ్మెతో ఓపీ సేవలకు అంతరాయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హోమియోపతి జూనియర్ డాక్టర్లు హైదరాబాద్ లో సమ్మె ప్రారంభించారు. తమ డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టారు. స్టై ఫండ్ పెంపు కోరుతూ తెలంగాణలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పని చేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. నిర్ణీత కాలంలోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి ఆందోళనలు మొదలుపెట్టారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్-పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తున్నారు. నిత్యావసరాలు, అద్దెలు.. ఇలా అన్నిరకాల ధరలు, ఖర్చులు, జీవన వ్యయం పెరుగుతున్నా తమ స్టైఫండ్ పెంచకపోవడం అన్యాయమని వాపోతున్నారు. పదేళ్లుగా హోమియోపతి హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్ల స్టై ఫండ్ పెంపులో ఎలాంటి మార్పూ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* విధులకు దూరం
ఈరోజు ఉదయం నుంచీ జూనియర్ వైద్యులు, పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో విధులకు గైర్హాజరయ్యారు. హైదరాబాద్లోని రామంతాతపూర్లో ఉన్న జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీ మరియు తెలంగాణలోని ఇతర ఆయుష్ వైద్య కళాశాలల హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. స్టైఫండ్ పెంచాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఆందోళనలు ఆపేది లేదని జేఏసీ స్పష్టం చేశారు. వైద్యుల సమ్మెతో హోమియోపతి, ఆయుర్వేద, యునాని ఆస్పత్రుల్లో అవుట్-పేషెంట్ సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
