* హైదరాబాద్‌లో ముగిసిన పర్యటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ పర్యటన హైదరాబాద్‌లో ముగిసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి శంషాబాద్ కు మెస్సీ బయలుదేరారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లనున్నారు. ఆయన ‘GOAT ఇండియా టూర్ 2025’లో భాగంగా హైదరాబాద్‌ను సందర్శించారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అభిమానులను ఉర్రూతలూగించారు. విద్యార్థులకు ఫుట్‌బాల్ మ్యాచ్ పై పాఠాలు చెప్పారు. ఫుట్‌బాల్ క్లినిక్‌లు, స్నేహపూర్వక మ్యాచ్‌లలో పాల్గొన్నారు. మెస్సీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈరోజు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు.

