– వృద్ధ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చూపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం.
– నన్ను నేరుగా సంప్రదించండి
– మీ గౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు ముఖ్యం
– హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఐపిఎస్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ వారి పిల్లల జన్మ హక్కు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అన్నారు. ఈ విషయంలో ఎటువంటి వాదనలు, సాకులు, సమర్థనలు ఉండవని వృద్ధ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సామాజిక వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రతిరోజు, వివిధ సమస్యలు, కష్టాలతో నా వద్దకు వచ్చే లెక్కలనంత మంది పిటిషనర్లను నేను కలుస్తాను.చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు వారిని వృద్ధాప్యంలో చూసుకోవడం లేదని చెప్పడం నన్ను తీవ్రంగా కదిలించింది అని సజ్జనర్ పేర్కొన్నారు. మీరు ఈ రోజు మీ తల్లిదండ్రులతో వ్యవహరించే విధానం మీ పిల్లలు నేర్చుకునే పాఠం మీరు వృద్ధులైనప్పుడు మీ పిల్లలనుండి మీరు తిరిగి అదే పొందుతారు అని సజ్జనర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులు ఎవరైనా నన్ను నేరుగా సంప్రదించండి. మీ గౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు ముఖ్యం అని ఆయన భరోసా ఇచ్చారు.

……………………………………………..

