– వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : సైన్స్ ద్వారా వ్యవస్థను బాగుపరిచేలా విద్యా బోధన జరగాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.హనుమకొండ జిల్లా స్థాయి 2025 DLEPC,DLBVP విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు సెయింట్ పీటర్స్ పాఠశాలలో గత రెండు రోజులుగా జరిగాయి. రెండు రోజులు గా వివిధ మండలాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ని ఆసక్తిగా తిలకించారు. శనివారం సాయంత్రం జరిగిన సైన్స్ బహుమతుల ప్రధానోత్సవ వేడుకలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.సైన్స్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ , సైన్స్ ద్వారా సమాజంలోని సామాజిక రుగ్మతలు పారదొరెలా విద్యార్థులను తయారు చేయాలి. విద్యార్థులు సెల్ ఫోన్లు వాడొద్దు అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ పోటీలలో 7 సబ్ థీమ్ లకు గాను సీనియర్స్, జూనియర్ ల నుండి 200 పై చిలుకు సైన్స్ ఎగ్జిబిట్లు , 93 ఇన్స్పైర్ మనక్ సైన్స్ ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు.ఇన్స్పైర్లో 9 మంది, సైన్స్ ఫెయిర్లో 9 విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు.కార్యక్రమంలో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గిరిరాజ్ గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ మహేష్, డాక్టర్ మనోహన్, బద్దం సుదర్శన్ రెడ్డి, సునీత, రఘు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి, జిల్లా మండల విద్యాధికారులు, నారాయణరెడ్డి సెయింట్ పీటర్స్ విద్యాసంస్థలు,సైన్సు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

………………………………………
