వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
* వేలాంకిణికి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేశాఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : క్రిస్మస్ నేపథ్యంలో వేలాంకిణి చర్చిలో ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం సికింద్రాబాద్-వేలాంకిణి (Secunderabad-Velankani)మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07407 ప్రత్యేకరైలు ఈ నెల 23న (మంగళవారం) రాత్రి 7.25గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి బుధవారం సాయంత్రం 5.30గంటలకు వేలాంకిణి చేరనుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో 07408 ప్రత్యేకరైలు ఈ నెల 25న (గురువారం) ఉదయం 8గంటలకు వేలాంకిణిలో బయల్దేరి, శుక్రవారం ఉదయం 6.10గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో ఈ ప్రత్యేకరైళ్లు చర్లపల్లి, నల్గొండ(Nalgonda), మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు(Guntur), తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, మెల్మారువతుర్, విల్లుపురం, కారైకల్, నాగపట్నం తదితర స్టేషన్లలో (ఇరువైపులా)ఆగుతుందని పేర్కొన్నారు.
………………………………………..

