* రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో ఆదివాసీల ఆరాధ్య దైవం సార్లమ్మ వెలసిన కన్నెపల్లి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసురి అనసూయ సీతక్క అన్నారు.
మొదట కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర లు బుధవారం ఆదివాసీల ఆచార సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నేపల్లి గ్రామంలో వృద్ధులకు,గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దట్టమైన అడవి ప్రాంతమైన కన్నేపల్లి గ్రామంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున దుప్పట్లు, స్వేటర్లు పంపిణీ చేస్తున్నామన్నారు.గ్రామస్థులకు స్థానికంగా అడవిలో దొరికే వనరులతో ఉపాధి కల్పిస్తామని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు.
మంత్రి వెంట ములుగు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ , ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ,స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు గ్రామ సర్పంచ్ కోరం సృజన,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పూజారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

………………………………………………………

