* సహకార పరపతి సంఘాల వద్ద బారులు
ఆకేరు న్యూస్, డెస్క్ : యాసంగి సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలో రైతులు ఈరోజు ఉదయం నుంచి భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. సహకార పరపతి సంఘం వద్ద రైతులు గంటల కొద్దీ వేచి ఉన్నారు. ఈ సంఘానికి 1100 యూరియా బస్తాలను కేటాయించారు. యూరియాను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందగానే అన్నదాతలు ఆఘమేఘాల మీద ఇక్కడకు చేరుకున్నారు. బస్తాల కోసం గంటల తరబడి ఎండలో ఉన్నారు. అధికారులు తక్షణం స్పందించి యూరియా సమస్యను తీర్చాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. కొందరు రైతులు అధికారులతో వాగ్వాదానిక దిగారు. మరోవైపు వరంగల్ జిల్లా నెక్కొండలోని సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు. క్యూలో తోపులాట జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో పీఏసీఎస్ వద్ద యాప్‌లో నమోదు ఇబ్బందిగా మారడంతో ఆధార్ నమోదు చేసుకుంటూ పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులోని విక్రయ కేంద్రం వద్ద సగం మందికే పంపిణీ చేశారు.
…………………………………………………

