ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనులను , పార్కింగ్ స్థలాలను , బస్టాండ్ ప్రాంగణంలోని ప్రత్యేక పనులను , విఐపి , వివిఐపి రోడ్లను శ్రీ రామ్ సాగర్ చెరువును , రోడ్ల విస్తరణ ను , జంపన్న వాగు దగ్గర ఉన్న స్నాన ఘట్టాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కేకాన్ లు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జంపన్న వాగు పరిసరాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో ముందస్తుగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తున్నందున భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని , సూచించారు .కొంగలమడుగు ఏరియా నుండి జంపన్న వాగు వరకు రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు రోడ్ల పరిశీలన చేశామని , భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి , పనులలో ఇంకా వేగం పెంచాలి అని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర , జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ , ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, ములుగు డిఎస్పీ రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి , జిల్లా అధికారులు , స్థానిక ఎమ్మార్వో సురేష్ బాబు , మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ , మండల అధికారులు , జిల్లా , మండల నాయకులు ఇర్ప సునీల్ తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………….

