* మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదం
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ : తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ లో స్కూలు బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ – బెంగళూరు (Hyderabad – Bengalure) జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. బోల్తా పడిన బస్సు నుంచి విద్యార్ధులను స్థానికులు బయటకు తీశారు. పలువురు కాలేజీ విద్యార్థులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మరికల్ లోని ప్రైవేటు కాలేజీలు విహారయాత్రకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓకారును వెనుక ఢీ కొట్టి బస్సు ఆగింది. స్కూలు బస్సును వెనుక నుంచి రెండు బస్సులు ఢీ కొట్టాయి. వెనుక నుంచి వాహనాలు ఢీ కొట్టడంతో స్కూలు బస్సు బోల్తా పడింది. మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు.
………………………………………….

