ఆకేరు న్యూస్,ములుగు: ఆంక్షలు లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వెంకటాపూర్ మండల అధ్యక్షులు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై పలువురు నాయకులు మాట్లాడుతూ యాసంగి పంట రైతులు నార్లు పోసుకొని పంట పొలాలు సాగు చేసే క్రమంలో రైతులకు యూరియా కోసం సరఫరా కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామునుండే రైతులు క్యూ లైన్ లలో నిలుచుండి తెల్లవారేసరికి ఒక బస్తా యూరియ దొరికే పరిస్థితి నెలకొన్నదని,మరి కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం గ్రోమోర్ ద్వారా యూరియా బస్తా తీసుకుంటే మరికొన్ని ఎరువులు , పురుగు మందులు తీసుకోవాలని షరతులు పెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి రైతును రాజు చేస్తానని రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూసుకుంటానని గొప్ప గొప్ప మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు రైతులు యూరియా కోసం బారులుగా లైన్లలో నిలబడి ఉంటుందన్నది కనపడుటలేదని అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకునే రైతులకు యూరియా కావాలంటే మొబైల్ ఫోన్లలో యాప్ లో బుక్ చేసుకుని యూరియా తీసుకోవాలని అనడం సబబు కాదని అన్నారు అన్నదాతలు ఎక్కువగా చదువుకోలేని పరిస్థితి ఉంది అని అలాంటివారు ఫోన్లలో యాప్ ఎలా వాడుతారు అని ప్రశ్నించారు.ప్రభుత్వం రైతుల కోసం సరిపడా యూరియా ఉంది ఆందోళన చెందవద్దు అని అంటూ ఉంటే మరి యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మహిళా రైతులు బారులుగా ఎలా నిలబడి ఉంటున్నారో ఎందుకు ఉంటున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
యాసంగి పంట సమీపిస్తుండగా రైతులు సేద్యానికి సిద్ధమవుతుండగా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.
వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామం నుండి రాజేశ్వరరావు పల్లె వరకు గతంలో 90 లక్షలకు మంజూరైన రోడ్డును రి కాల్ చేసి మళ్లీ దాన్ని అదనంగా రీ ఎస్టిమేషన్ చేయించి పెద్దగా చేయిస్తామని చెప్పగా ఇంతవరకు పనులలో ఎలాంటి పురోగతి లేదని అన్నారు ఎన్నికల్లో మంత్రి రోడ్డును వెంటనే బాగు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయి దాదాపు రెండేళ్లు గడుస్తున్న ఇంతవరకు పనులు మొదలు కాలేదని గుర్తు చేశారు. వెంటనే రోడ్డు పనులను పూర్తి చేసి రాజేశ్వరరావు పల్లికి బస్సు సౌకర్యం కల్పించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి,గూడూరు ప్రశాంత్ వార్డ్ సభ్యులు చెక్క రాజేందర్ మూల గుండ్ల దేవేందర్ సనుగోజు హరిబాబు వైకుంఠం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….

