ఆకేరు న్యూస్, డెస్క్ : కొత్త సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ బారులో జరిగిన పేలుడు ఘటనలో 40 మంది వరకు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. స్విట్జర్లాండ్ క్రాన్స్ మాంటానాలోని విలాసవంతమైన ఆల్పైన్ స్కీ రిసార్ట్ నగరం లే కాన్స్టెల్లేషన్ బార్లో మంటలు చెలరేగాయి. పేలుడు సంభవించి అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బార్లో 100 మంది వరకు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. తీవ్రమైన గాయాలతో చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అగ్ని ప్రమాద వీడియోలు వైరల్ అవుతున్నాయి. పోలీసు సిబ్బంది, అగ్నిమాపక బృందాలు, పలు హెలికాప్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. బాధితుల బంధువులు వివరాలు తెలుసుకోవడానికి ఒక హాట్‌లైన్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, ఎవరినీ రానివ్వడం లేదు. అగ్ని ప్రమాదానికి స్పష్టమైన కారణాలను ఇంకా గుర్తించలేదని తెలిసింది. స్విస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………………..

