* చైనాలో సంఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : పాముకు పాలు పోసి పెంచినా .. కాటేయక మానదంటారు పెద్దలు.. ఆ మాటలు అక్షర సత్యాలుగా మారాయి. చైనా మీడియా సీసీటీవీ లో వెబ్ సైట్లో ప్రచురించారు. ఈ సంఘటన డిసెంబర్ 18న జరిగింది. చైనా లోని బీజింగ్ గ్రామీణ ప్రాంతంలో హుయాంగ్ అనే వ్యక్తి అల్లారు ముద్దుగా పామును పెంచుకున్నాడు. ఆయనకు చిన్నతనం నుంచే పాములంటే ప్రాణం.. చాలా కాలంగా పెంచుకుంటున్న పాముతో కాలం వెల్ల బుచ్చుతున్నాడు.. పాపం ఒక రోజు పాముకు సుస్తీ చేసింది.. తాను ఏ ఆహారం అందించినా పాపం పాము స్వీకరించడం లేదటా.. బాధతో విలవిల్లాడిన హుయాంగ్ చుచు..బుజ్ఝు ..అన్నం తినమ్మా.. నేను ఉన్నా కదా.. నీకు ఏం కాదమ్మా అని ముద్దు చేస్తూ తన స్వహస్తాలతో పాముకు తినిపించే ప్రయత్నం చేశాడటా .. ఇంకే ముంది పాముకు ఒక్కసారిగి కోపం వచ్చింది.. వద్దని చెబుతాంటే అర్థం అవుతలేదా.. అసలే నాకు ఆరోగ్యం బాగా లేదంటే .. బలవంతంగా తినమని నోటి దగ్గర పెడుతున్నవ్ అని కసక్కున కాటేసింది.. ఇంకే ముంది లబో దిబో మంటూ పామును కింద పడేసి ఆస్పత్రికి పరుగులు పెట్టాడు.. అప్పటికే ఆలస్యం అయింది.. అయినా ప్రాణం కాపాడుతాం కాని.. నీ బొటన వేలు మాత్రం కట్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చేశారట.. ప్రాణం నిలుస్తదంటే వేలు అవసరం లేదన్నాడటా హుయాంగ్ .. డాక్టర్లు చేతి బోటన వేలును తీసేశారు.. పామును పెంచుకుంటే ఎపుడో ఓసారి కాటేయదా అంటూ ఇప్పటికైనా పాములను పెంచడం మానేయమని గ్రామస్తులు ఆయనకు సలహా ఇస్తున్నారటా.. చూద్దాం పాములంటే ప్రాణం పెట్టే … ఆయన ప్రాణం నిలుపుకుంటాడో లేదో కదా…!
—————————————–

