– గ్రామస్తులతో కలిపి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి.
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజ్ పల్లి గ్రామ పరిధిలోని పిట్టలపల్లి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏ.సీ.పీ పింగళి ప్రశాంత్ రెడ్డి భరోసానిచ్చారు. ఎక్కడ సమస్య ఉన్న మానవత్వం చాటుకునే కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి సోమవారం కనీస రోడ్డు సౌకర్యం లేని పిట్టలపల్లి గ్రామానికి స్వయంగా తానే ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి, గ్రామ ప్రజలతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చేరుకునే రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడం, వైద్య సదుపాయం, పాఠశాల నిర్మాణానికి సంబంధించి సహాయం చేస్తామని పోలీసు డిపార్ట్మెంట్ తరుపున భరోసా ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకొని గ్రామాన్ని, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అక్కడ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఏసిపి తో పాటు కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ , సబ్ ఇన్స్పెక్టర్ మధు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, స్థానిక యువత పాల్గొన్నారు.

……………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
