ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మావోయిస్టుల ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. హిడ్మా ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టు గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు దేవా అత్యంత సన్నిహితుడు ఇద్దరిదీ ఒకే గ్రామం. చత్తీస్ గడ్రాష్ట్రంలోని పూవర్తి గ్రామానికి చెందిన ఈ ఇద్దరు అగ్రనేతలే దాదాపుగా ఒకే సారి ఉద్యమంలోకి వచ్చారు. పార్టీలో అత్యంత శక్తి వంతమైన పీఎల్ జీఏ బెటాలియన్ నంబర్ వన్ కు బాధ్యుడుగా దేవా వ్యవహరిస్తున్నారు. దేవాతో పాటు మరో 15 మంది డీజీపీ ఎదుట లొంగిపోయారు.
…………………………………………

