* ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కొండగట్టులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 35.19 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో నిర్మిస్తున్న 96 గదుల ధర్మశాలకు దీక్ష విరమణ మండపానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి విశ్వవ్యాప్తమైన దేవుడని ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం తన అదృష్టమని అన్నారు. ఆంజనేయస్వామి తనకు పునర్జన్మను ప్రసాదించిన దేవుడని అన్నారు. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తనను ఆంజనేయస్వామే కాపాడాడని తాను నమ్ముతానని అన్నారు. గతంలో కొండగట్టును సందర్శించిన క్రమంలో ఆలయ పూజారులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని తన కోరారని అన్నారు. ఆలయ పూజారుల ప్రతిపాదనను టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడానికి అంగీకరించారని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారుల సమష్టి
కృషి వల్లనే నేడు ఈ పవిత్ర కార్యక్రమానికి భూమి పూజ.చేయడం జరిగిందని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………….

