* 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం ఉండదు
* గౌరీ శంకర్ జీ ఓ ఐకాన్
* ఏబీవీపీ 44 వ మహాసభల్లో కేంద్రమంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏబీవీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న నక్సల్స్ ను అంతమొందించిన మహా నాయకుడు మోదీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉన్న వైఎస్సార్ కన్వెన్షన్ హాల్ లో జరిగిని ఏబీవీపీ 44వ మహాసభల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనమంచి గౌరీ శంకర్ జీ యువ పురస్కారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గౌరీ శంకర్ విద్యార్థులకు ఓ ఐకాన్ లాంటి వాడని అన్నారు. తన జీవితాన్ని మొత్తం ఏబీవీపీ సిద్ధాంతాలకే అంకితం చేశాడని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడారని గుర్తు చేశారు. దేశంలో టెక్నాలజీ పెరిగింది. నక్సలైట్ల, టెర్రరిస్టుల సమస్యలు ఇప్పుడు లేవని అన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేసా్తమని అన్నారు. విద్యా రంగంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్నిభ్రష్టు పట్టిస్తోందని అన్నారు.గౌరీ శంకర్ స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటాలకు నడుం బిగించాల్సిందిగా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పానగల్ కు చెందిన సామాజిక కార్యకర్త హెచ్ ఐ వీ బాధితులకు వారి పిల్లలకు సేవలందిస్తున్న భీమనపల్లి శ్రీకాంత్ కు జనమంచి గౌరీ శంకర్ జీ పురస్కారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు.

