Sikkim Tunnel Collapse
Published:
ఆకేరు న్యూస్, డెస్క్: సిక్కింలోని నామ్చి జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌పిసి (NHPC) తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో మిథేన్ గ్యాస్ లీకేజీ వల్ల భారీ పేలుడు సంభవించి సొరంగం కూలిపోయింది.
ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల చిక్కుకున్న 25 మంది సిబ్బందిలో మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. విషవాయువులు, దట్టమైన పొగ సవాళ్లుగా మారినప్పటికీ, లోపల ఉన్న మిగిలిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), మైన్స్ సేఫ్టీ (DGMS) బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. బాధితులకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
