* నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు బేషజాలు వదిలేయాలి
* సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) శత వసంత వేడుకలు జరిగాయని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఖమ్మంలో ఈనెల 18న ముగింపు ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయని వెల్లడించారు. ముగింపు ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలుపుతారని అన్నారు. భారత రాజకీయాల్లో రెండు పార్టీలే వందేళ్ల కీర్తిని గడించాయని వివరించారు. సీపీఐది వందేళ్ల చరిత్ర అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు బేషజాలు వదిలేయాలని సూచించారు. ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
…………………………………….

