* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్,ములుగు: యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ రెండవ ఎడిషన్ సరైన వేదిక అని ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ క్రీడాపోటీలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి జిల్లా లో ఈ నెల 8 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల వరకు, ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, జడ్పీహెచ్ఎస్ మల్లంపల్లి పాఠశాలలో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ పాఠశాలలో, మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు, జడ్పీహెచ్ఎస్ గోవిందరావుపేట్ పాఠశాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు, 9వ తేదీన ఐటీడీఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, జడ్పీహెచ్ఎస్ మంగపేట పాఠశాలలో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏ హెచ్ ఎస్ గర్ల్స్ తాడ్వాయి పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు,
10వ తేదీన జడ్పీహెచ్ఎస్ ముప్పనపల్లి పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, జడ్.పి.హెచ్.ఎస్ వాజేడు పాఠశాలలో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,
జడ్పీహెచ్ఎస్ వెంకటాపురం పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది పేర్కొన్నారు. శాట్స్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుందని,ఈ నెల 17 వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వ తేదీ వరకు వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు ఎక్కువ మెడల్స్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడ అధికారి మలోత్ సర్దార్ సింగ్ , డి ఈ ఓ సిద్ధార్థ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడలా వెంకటేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, పీడీలు, పిఈటి లు , కోచ్ లు , తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………..

