* గజ్జెల కాంతం కామెంట్స్ పై సర్వత్రా ఆసక్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు ఇంత ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2022 జనవరి 24న ఒక హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు ఇచ్చారని.. ఒక కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలు ఏ హీరోయిన్ ను ఉద్దేశించి మాట్లాడారు అనే దాని మీద చర్చ జరుగుతోంది.ముంబైలోని తాజ్ కృష్ణా హోటల్ 328వ గదికి ఒక హీరోయిన్ను పిలిపించి, రూ.35 కోట్ల 75 లక్షలతో విల్లా కొనిచ్చారని, ఆడి కారు కూడా బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. 2022 మార్చి 3న ఢిల్లీలోని లలిత్ హోటల్ 770వ గదికి.. మైసూర్లో షూటింగ్ చేస్తున్న హీరోయిన్ను బెదిరించి పిలిపించుకున్నారని, రూ.50 కోట్లు ఇస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లు, దుబాయ్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు.

