* ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముగ్గురు కలిసి బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఆ ముగ్గురూ ఎగిరిపడ్డారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి (Vanaparthi) మర్రితండాకు చెందిన ధరావత్ మోతీ రామ్ నాయక్ (55), జాటోతు నరసింహ(30), వనపర్తికి చెందిన దరిపెల్లి నరసింహులు (45) ముగ్గురు కలిసి బైక్పై వనపర్తికి వెళ్తున్నారు. నవాపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోతీరామ్ నాయక్, నరసింహులు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నరసింహను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జనగామ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
